
సబ్సిడీ విత్తనాలు వినియోగించుకోవాలి
అయిజ: నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం (ఎన్‌ఎంఈఓ ఓఎస్)లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ద్వారా రైతులకు ఉచితంగా అందజేస్తున్న వేరుశనగ విత్తనాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో వంద శాతం సబ్సిడీపై వేరుశెనగ విత్తనాల పంపిణీ చేశారు. వ్యవసాయ అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్, టెక్నికల్ ఏడీఏ మహాలక్ష్మి, సింగిల్ విండో అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.