
భక్తులతో కిక్కిరిసిన ఆదిశిలాక్షేత్రం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఈసందర్భంగా అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అదే విధంగా సద్దలోనిపల్లి కృష్ణస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్పస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు అరవిందరావు, చంద్రశేఖర్‌రావు, వాల్మీకి పూజారులు తిమ్మప్ప, నర్సింహులు, ఆలయ సిబ్బంది రంగనాథ్, ఉరుకుందు, కృష్ణ, శివమ్ములు పాల్గొన్నారు.