
ఉధృతంగా పారుతున్న వాగులు
సాతర్ల సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు
చెన్నిపాడులో మిరప పంటలో నిలిచిన వర్షం నీరు
నీలహళ్లి, పాతపాలెం మధ్య పారుతున్న వాగు
ఉండవెల్లి మండలంలోని మెన్నిపాడు వాగు ఉధృతంగా ప్రవహించింది. పంటలు నీట మునగడంతో నష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. బొంకూరులో వర్షానికి షాకినాబీ ఇంటి పైకప్పు కూలిపోయింది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
మానవపాడు మండలంలో భారీ వర్షాలకు పంట పొలాల్లో నీరు చేరి పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవపాడు–అమరవాయి, మానవపాడు–గోకులపాడు వాగులు పొంగిపోర్లాయి.
సాక్షి, నెట్‌వర్క్: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసి వర్షాలతో జిల్లావ్యాప్తంగా పలు కుంటలు, చెరువులు అలుగులు పారుతున్నాయి. శనివారం లోలెవల్ బ్రిడ్జిల వద్ద వరద ప్రవాహం అధికంగా ఉండడంతో కొన్ని చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయ ఏర్పడింది. పంటలు నీట మునిగి రైతులు ఆర్థికంగా నష్టపోయారు. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి.
గట్టు పెద్ద చెరువు నిండి అలుగు పారింది. మాజీ ఎంపీటీసీ కృష్ణ చెరువు అలుగు వద్ద గంగమ్మకు పూజలు చేశారు. మండలంలో అత్యధికంగా 118.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ధరూరు మండలంలోని నీలహళ్లి, పాతపాలెం గ్రామాల మధ్య ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిచడంతో 6 గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. మధ్యాహ్నం తర్వాత వరద తగ్గడంతో రాకపోకలు కొనసాగించారు. రోడ్డు కం బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించి మూడేళ్లు గడుస్తున్నా నేటికీ పనులు పూర్తి కాకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడంలేదు.
ఉమ్మడి ఇటిక్యాల మండలంలోని షేకుపల్లి, సాసనూలు, గార్లపాడు, ఉదండాపురం, సాతర్ల, శనిగపల్లి, చాగాపురం, ఇటిక్యాల తదితర గ్రామాల సమీపంలోని పలు వాగులు శనివారం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు గ్రామాల్లో పత్తి, మిరప, బెండ, పొగాకు, వరి పంటల్లో వర్షపు నీరు చేరి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

ఉధృతంగా పారుతున్న వాగులు

ఉధృతంగా పారుతున్న వాగులు

ఉధృతంగా పారుతున్న వాగులు