
చిన్నోనిపల్లి రిజర్వాయర్‌లో పెరిగిన నీటిమట్టం
గట్టు : చిన్నోనిపల్లె రిజర్వాయర్‌ను శనివారం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకల్లోని వరద రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతున్నాయి. రిజర్వాయర్‌లో నీటి మట్టం పెరుగుతున్న తరుణంలో గతంలో గండిని పూడ్చిన చోటుకు సమీపంలో నీరు వచ్చి చేరాయి. రిజర్వాయర్‌లో ఎక్కువైన నీరు బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన సమాంతర కాల్వ ఉన్నప్పటికీ నీటికి బయటకు వెళ్లట్లేదు. రిజర్వాయర్‌లోకి వచ్చే నీరు ఎక్కువగా వస్తుండడంతో కట్ట తెగిపోయే ప్రమాదం ఉంది. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, తహసీల్దార్ విజయ్‌కుమార్, గిర్ధావర్ రాజు, ఇరిగేషన్ అధికారులు చిన్నోనిపల్లె రిజర్వాయర్‌ను పరిశీలించారు. విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. వర్షాలు తగ్గిన నేపథ్యంలో మట్టి కట్టను మరి కొంత మేరకు పెంచితే రిజర్వాయర్‌లోని నీరు కాల్వ ద్వారా బయటకు వెళ్లిపోతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ దిశగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.