
నేత్ర పర్వం... అమ్మవారి అలంకారం
గద్వాలటౌన్: శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదో రోజు అన్ని ఆలయాల్లో అమ్మవారు ధనలక్ష్మి, మహాలక్ష్మిగా దర్శనమిచ్చారు. నడిగడ్డ ప్రజల ఇలవేల్పు జములమ్మ అమ్మవారు ధనలక్ష్మీ అలంకరణలో దర్శనమిచ్చారు. ఉదయం నుంచే మంగళవాయిద్యాల మధ్య ఆలయాల్లో సుప్రభాత సేవ, అభిషేకాలు, విశేష పూజలు చేశారు. లలిత సహస్రనామ పారాయణములను భక్తిశ్రద్దలతో నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కుంకుమార్చనలు చేశారు. స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయం, మార్కండేయస్వా మి ఆలయం, అంబాభవాని, కుమ్మరివీధి, బాలాజీవీధి, పిల్లిగుండ్ల ముడుపు ఆంజనేయస్వామి ఆలయాల్లో అమ్మవారు ధనలక్ష్మిగా దర్శనమిచ్చారు. కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో అమ్మవారు అశ్వవాహనంపై ఊరేగారు. ఇదిలాఉండగా వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రూ.5.55 కోట్ల కరెన్సీతో, 2వ వార్డులోని శ్రీశక్తిస్వరూపిణి తాయమ్మ దేవస్థానంలో రూ.51లక్షల కరెన్సీతో అమ్మవారిని అ లకరించారు. మహిళలు అమ్మవారి ఎ దుట దీపాలు వెలిగించి మొక్కులు తీ ర్చుకున్నారు. అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆ తల్లిని వేడుకున్నారు.

నేత్ర పర్వం... అమ్మవారి అలంకారం