
చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం
గద్వాల: తెలంగాణ సాయుధపోరాట చరిత్రలో చాకలి ఐలమ్మ విశిష్టమైన పాత్రపోషించి మహిళా చైతన్యం, దైర్యసాహసాలు, బహుజన ఆత్మగౌరవానికి శాశ్వత ప్రతీకగా నిలిచారని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాయలంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కలెక్టర్.. చాకలిఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ కేవలం ఒక మహిళగానే కాకుండా సమాజంలో అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారన్నారు. భూస్వాముల అన్యాయాలు, దో పిడీదారులకు వ్యతిరేకంగా తన ౖధైర్యసాహసాల తో పోరాటం చేసిన వీరనారి అన్నారు. తనకు ఎ దురైన కష్టాలకు, అవమానాలకు వెనక్కి తగ్గకుండా ప్రజల హక్కుల కోసం ముందుకు సాగారన్నా రు. చాకలి ఐలమ్మ జీవితం ధైర్యం, పట్టుదల, త్యాగస్ఫూర్తికి మారుపేరుగా నిలుస్తుందన్నా రు.అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, డీపీవో నాగేంద్రం, ఏవో భూపాల్, బీసీసంక్షేమశాఖ అధికారి అక్బర్‌పాషాపాల్గొన్నారు.
ఆదర్శప్రాయురాలు..
గద్వాల క్రైం: పేదల తరుపున పెత్తందార్లతో పోరాడిన వీర నారి చాకలి ఐలమ్మ అని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఐలమ్మ 130 జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిరుపేదల సమస్యలపై నిరంరం పోరాటం చేసిన మహిళా యోధురాలని, ఆదిపత్యవాదంపై ఎర్ర జెండాతో ఎదురునిలిచి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా పోరాటం చేసిందన్నారు. ఆమె ఆశయలను ప్రతిఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఏఎస్పీ, డీఎస్పీ, సీఐలు సిబ్బంది పాల్గొన్నారు.
వీరవనిత ఐలమ్మ
శాంతినగర్: భూమికోసం, భుక్తికోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత ఐలమ్మ అని, ఆమె జీవితం మహిళాలోకానికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. వడ్డేపల్లి పుర పరిధిలోని శాంతినగర్ రామాపురం చౌరస్తాలో శుక్రవారం నిర్వహించిన ఐలమ్మ జయంతి వేడుకలకు ఆయనతోపాటు ఎమ్మెల్యే విజయుడు ముఖ్యఅతిథులుగా హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం