
వర్షం వస్తే మొత్తం ఆగాల్సిందే
వర్షం కురిసిందంటే మా మగ్గం మొత్తం తడిసిపోతుంది. దీంతో చీరలు నేయడం కదరదు. ఇప్పుడు మగ్గం గుంతల్లో నీరు నిలిచింది. ఆ నీటిని తోడుకునేందుకు సమయం సరిపోదు. ఎంత తోడినా ఊట గుంతలో మాదిరి నీరు వస్తూనే ఉంటాయి. అందులో వర్షం కురుస్తుండటంతో నీరు ఇంకా ఎక్కువగా చేరుతుంది. పది రోజులుగా పైసా పని లేకుండా కార్మికులం దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నాం.
– హేమలత, చేనేత కార్మికురాలు, రాజోళి
పండుగ ముందు కార్మికులకు నష్టమే
ప్రస్తుతం దసరా పండుగ సీజన్ కావడంతో కార్మికులకు చేతి నిండా పనుటుంది. కానీ వర్షాలు కురవడంతో మగ్గం గుంతల్లోకి నీరు చేరింది. దీంతో పనులు నిలిచిపోయాయి. వర్షం నీరు చేరితే నీరు బయటకు వెళ్లి, మెటీరియల్ సెట్ అయ్యేందుకు రెండు రోజులు పడుతుంది. ఇలా వారంలో ఒక్కసారి వర్షం కురిసినా..పనులు నిలస్తున్నాయి. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కార్మికుల ఇబ్బందులను తొలగించాలి.
– స్వాతి, చేనేత కార్మికురాలు రాజోళి
●

వర్షం వస్తే మొత్తం ఆగాల్సిందే