
ఆలయాల నిర్మాణానికి విరాళం
గద్వాలటౌన్/అలంపూర్: జిల్లా కేంద్రంలోని నల్లకుంట శివాలయ పునర్నిర్మాణం రూ.2కోట్ల వ్యయంతో చేపట్టగా.. కాలనీ ప్రజలతో పాటు సమీప కాలనీల భక్తుల నుంచి ఆలయ కమిటీ సభ్యులు విరాళాలను సేకరిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, రెడ్‌క్రాస్ సోసైటీ జిల్లా అధ్యక్షుడు అయ్యపురెడ్డి రూ.2,51,116ను విరాళంగా అందజేశారు. వీరితో పాటు మరికొందరు అలయ నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వహకులు పులిపాటి వెంకటేష్, వెంకట్రాములు, గోపాల్, నల్లారెడ్డి, నాగరాజు శెట్టి, రాజు, బాలాజీ, బుచ్చన్న పాల్గొన్నారు.
జోగుళాంబ ఆలయానికి..
అలంపూర్ జోగుళాంబ ఆలయాలకు హైదరాబాద్‌కు చెందిన మహేష్‌కుమార్ రెడ్డి – రాధికా రెడ్డి దంపతులు రూ.లక్ష విరాళం అందజేసినట్లు ఈఓ దీప్తి తెలిపారు. ఈ సందర్భంగా వారు జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు శేషవస్త్రాలతో వారిని సత్కరించారు. అర్చక స్వాములు వారికి తీర్ధ ప్రసాదాలను అందజేసి అశీర్వచనం పలికారు. వీరితోపాటు ఆలయ అధికారులు ఉన్నారు.
వేరుశనగ క్వింటా రూ.4,321
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు సోమవారం 79 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.4321, కనిష్టం రూ.2720, సరాసరి రూ. 3821 ధరలు లభించాయి. అలాగే, 107 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టం రూ. 5930, కనిష్టం రూ. 5792, సరాసరి రూ. 5930 ధరలు పలికాయి.
ఉద్యోగ అవకాశాలు
కల్పించేస్థాయికి ఎదగాలి
వనపర్తిటౌన్: ఇంజినీరింగ్ విద్యార్థులు ఉద్యోగం కోసం వెదుక్కోకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని స్థానిక జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్‌వీఎస్ రాజు ఆకాంక్షించారు. బుధవారం కళాశాలలో డీసీ–ఎంఎస్‌ఎంఈ, న్యూఢిల్లీ సహకారంతో ఎంట్రప్రెన్యూర్‌షిప్‌పై అవగాహన సదస్సు నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఆలోచన ఉంటే సరిపోదని.. కృషి, పట్టుదల, నమ్మకం ఉండాలని, అన్ని ఉంటేనే జీవితంలో, సమాజంలో రాణించగలమన్నారు. ఎస్‌ఐసీ –టీఎస్సీ డిప్యూటీ మేనేజర్ అబ్దుల్ ఖాదర్ ఎంట్రప్రెన్యూర్‌షిప్, స్టార్టప్‌లపై అవగాహన కల్పించారు. వైస్ ప్రిన్సిపాల్ బీవీ రాంనరేష్ పాల్గొన్నారు.
26న ఉద్యోగమేళా
కందనూలు: జిల్లా కేంద్రంలోని నేషనల్ ఐటీఐ కళాశాలలో 26న ఉద్యోగమేళా నిర్వ హించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనశాఖ అధి కారి రాఘవేందర్‌సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా 50 ఉద్యోగాల భర్తీకి మేళా కొనసాగుతుందన్నారు. పదో తరగతి ఆర్హత కలిగి 25 నుంచి 32 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. వివరాలకు 95051 86201, 96669 74704 నంబర్లను సంప్రదించాలని కోరారు.