
పండ్ల తోటలను సంరక్షించుకోవాలి
అయిజ: పండ్ల తోటలను అనేక చీడపీడలు ఆశిస్తాయని, రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ పండ్లతోటలను సంరక్షించుకోవాలని హార్టికల్చర్ జిల్లా అధికారి ఎండీ అక్బర్ అన్నారు. బుధవారం మండలంలోని తుపత్రాల, బి.తిమ్మాపూర్, దేవబడ శివార్లలో బత్తాయి, దానిమ్మ, ఆయిల్ పాం తోటలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండ్ల తోటలను జిల్లాలో ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేశరని, మొక్కలు నాటిన సంవత్సరం వరకు అనేక రకాల పురుగులు, తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుందని అన్నారు. మొక్కలకు ఎప్పటికప్పుడు పురుగుమందులను పిచికారీ చేయాలని సూచించారు. సూక్ష్మదాతువు పోషకాల లోపాలు మొక్కల్లో కనిపిస్తే ఆకులు రంగుమారుతాయన, గిడుసబారిపోతాయని, మెక్కల ఎదుగుదల లోపిస్తుందని వివరించారు. వాటిలోపాన్ని భర్తి చేసేందుకు ఫార్ముల4 లేక ఫార్ముల 6ను ఎంపిక చేసుకొని మొక్కలపై పిచిచారి చేయాలని, లేదా ఎరువుతోపాటు కలిపి మొక్కల వేర్లకు అందేలా చేయాలని రైతులకు పలు సలహాలు సూచనలు చేశారు. కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి మహేష్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.