ఇష్టారాజ్యం! | - | Sakshi
Sakshi News home page

ఇష్టారాజ్యం!

Sep 24 2025 7:47 AM | Updated on Sep 24 2025 7:47 AM

ఇష్టా

ఇష్టారాజ్యం!

గద్వాలలో అనుమతులు లేకుండా వెలుస్తున్న ఆకాశహార్మ్యాలు

ఇష్టానుసారంగా నిర్మాణాలు

చోద్యం చూస్తున్న అధికారులు

నోటీసులతోనే సరిపెడుతున్న వైనం

మున్సిపల్‌ ఆదాయానికి రూ.లక్షల్లో గండి

జిల్లా కేంద్రంలోని కొత్త హౌసింగ్‌బోర్డు కాలనీలో నిర్మిస్తున్న బహుళ అంతస్తు భవనం ఇది. ఈ భవనానికి సరైన అనుమతులు లేవు. పైగా 20 ఫీట్ల సర్వీస్‌ రోడ్డుకు సమీపంలో నిర్మాణం చేపడుతున్నారు. ఇక్కడ ఎలాంటి సెట్‌బ్యాక్‌ లేకుండా ఏకంగా సెల్లార్‌ నిర్మాణంతో కూడిన బహుళ అంతస్తు భవంతిని నిర్మిస్తున్నారు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

గద్వాల: జిల్లాకేంద్రమైన గద్వాల మున్సిపాలిటీ శరవేగంగా విస్తరిస్తోంది. నగరాల్లో కనిపించే ఇంద్ర భవనాలు, ఆకాశహార్మ్యాలు ఇక్కడ కూడా వెలుస్తున్నాయి. అయితే ఈ నిర్మాణాలు చేపట్టే క్రమంలో ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. తీసుకున్న అనుమతులకు చేపడుతున్న నిర్మాణాలకు ఎక్కడ కూడా పొంతన లేకుండా ఉంటుంది. ఇందుకు ఇటీవల వెలసిన బహుళ అంతస్తుల భవనాలే సాక్ష్యాలు. అదే విధంగా జిల్లా ఏర్పాటు అనంతరం జమ్మిచేడు, దౌదర్‌పల్లి గ్రామాలను గద్వాల మున్సిపాలిటీలో విలీనం చేశారు. దీంతో పట్టణ విస్తీర్ణం మరింత పెరిగింది. ప్రభుత్వ భూములు, 10 శాతం స్థలాలు రూ.కోట్లల్లో ధరలు పలుకుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తులు వీటిపై కన్నేసి చెరపట్టారు. వీరికి కొందరు అవినీతి అధికారులు తోడు కావడంతో గద్వాల మున్సిపాలిటీ అక్రమ కట్టడాలకు నిలయంగా మారింది.

20 ఫీట్ల సర్వీస్‌ రోడ్డు కబ్జా..

ఆర్‌ఓబీ నుంచి జములమ్మ ఆలయం వరకు ప్రధాన రహదారి పక్కన భవిష్యత్‌ అవసరాలను దృిష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 20 ఫీట్ల సర్వీస్‌రోడ్డు నిర్మించింది. అయితే ఈ రోడ్డును ఆక్రమిస్తూ పలు నిర్మాణాలు వెలిశాయి. ప్రస్తుతం సర్వీస్‌ రోడ్డు ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. సెట్‌బ్యాక్‌ స్థలం వదిలేసి.. మిగిలిన స్థలంలో నిర్మాణాలు చేపట్టాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కాని ఇవేవి అమలుకు నోచుకోవడం లేదు.

ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం..

మున్సిపాలిటీలో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. గతంలో కొన్ని కులాలకు ఇష్టానుసారంగా 10శాతం స్థలాలను అప్పనంగా కట్టబెట్టారు. ఈ క్రమంలోనే జ్ఞానప్రభ కళాశాల యాజమాని రవీందర్‌రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. స్పందించిన హైకోర్టు.. 10శాతం స్థలాల్లో వాటికి నిర్దేశించిన నిర్మాణాలు మాత్రమే చేపట్టాలని, అందుకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను వెంటనే వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మున్సిపల్‌ అధికారులు స్పందించకపోవడంతో సదరు వ్యక్తి మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు.

ఇష్టారాజ్యం!1
1/1

ఇష్టారాజ్యం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement