
డ్రాగన్ ఫ్రూట్ సాగుతో లాభాలు
శాంతినగర్: డ్రాగన్ ఫ్రూట్ సాగుతో రైతులు లాభాల బాట పట్టవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియా నాయక్ అన్నారు. వడ్డేపల్లి మండలం కొంకల రైతువేదికలో మంగళవారం డ్రాగన్ ఫ్రూట్ సాగుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రాగన్ ఫ్రూట్ సాగులో పాటించాల్సిన మెళకువలు, పంటకు ఆశించే చీడపీడల నివారణ, సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న పత్తి పంటను ఏఓ రాధతో కలిసి డీఏఓ పరిశీలించారు. వానాకాలం సాగు వివరాల నమోదుపై ఆరా తీశారు. అదే విధంగా శాంతినగర్‌లోని ఆగ్రోస్ రైతు సేవాకేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. గోదాంలో ఎరువుల బస్తాలు, స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించారు. డీఏఓ వెంట ఏఈఓలు విమల, వినోద్‌కుమార్ ఉన్నారు.