
ప్రత్యేక శిబిరాలు ప్రారంభం
మహిళలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయడంతోపాటు వ్యాధి నిర్ధారణ చేసి అన్ని మందులను ఉచితంగా అందజేయాలనే లక్ష్యంతో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా ఆస్పత్రిలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆరోగ్య సమస్యలపై సదస్సులు నిర్వహించి సూచనలు, అభిప్రాయాలను తెలియజేస్తారు. గద్వాల – అలంపూర్ సెగ్మెంట్‌లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు 618 మంది మహిళలకు ఆరోగ్యపరీక్షలు నిర్వహించారు. వ్యాధి నిర్ధారణ గుర్తించి మందులు సైతం అందజేస్తారు. మహిళలు సైతం శిబిరాలకు స్వచ్ఛందంగా వచ్చి రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు.