
‘లంపీస్కిన్’ కలకలం..!
జిల్లాలో 20 లేగ దూడలు మృతి
ఆగస్టు నుంచి ప్రబలిన వ్యాధి
గడిచిన నెల ఆగస్టు చివరివారం నుంచి జిల్లాలో వ్యాది ప్రబలడం ఆరంభం అయ్యింది. వాతావరణంలో తేమశాతం ఎక్కువగా ఉండటం, పశువుల్లో వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉండటం వల్ల వ్యాధి మళ్లీ ఆరంభం అయినట్లు పశుసంవర్దకశాఖ అధికారులు అంటున్నారు. కాగా ఈసారి లేగ దూడెల్లో వ్యాధి లక్షణాలు బయట పడ్డాయి. సంబంధిత రైతులు పశువైద్యాధికారుల దగ్గరకు తీసుకెళ్లగా పరిశీలించి వ్యాధి లక్షణాలను ప్రాథమికంగా గుర్తించి, చికిత్స అందించారు. అయితే ఆ తర్వాత ఈ వ్యాధి మెల్లగా అన్ని ప్రాంతాలకు ప్రబలుతోంది. లేగదూడలతో పాటు, కోడెళ్లల్లో వ్యాధి వ్యాప్తి చెందుతోంది. దాదాపు ఇప్పటికే 20 లేగదూడలు వ్యాధి భారిన పడి చనిపోయాయి. కాగా వ్యాధి భారిన పడిన దూడలు, కోడెలకు పశువైద్యాధికారులు చికిత్సలు అందిస్తున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న చోట ఆయా గ్రామాల్లో తెల్లజాతి పశువులకు ముందస్తుగా గోట్‌ఫాక్స్ వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇదిలాఉంటే లింపి స్కిన్ వ్యాధి ప్రబలుతుండటం పట్ల పాడి రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కాగా జిల్లాలో 60,528 తెల్లజాతి పశువులు ఉన్నాయి. లేగదూడలు, కోడెలతో పాటు, ఇతర తెల్లజాతి పశువుల్లో ఇప్పటికే అక్కడక్కడ వ్యాధి లక్షణా లు కన్పిస్తున్నాయి. అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
గద్వాల వ్యవసాయం: లంపీస్కిన్ (ముద్దచర్మ వ్యాధి) వ్యాధి మరోసారి ప్రబలుతోంది. గడిచిన 20 రోజుల నుంచి జిల్లాలోని పలుచోట్ల ప్రధానంగా దూడలు, కోడెదూడల్లో లంపీ స్కిన్ వ్యాధి లక్షణాలు పశువుల్లో కనిపిస్తున్నాయి. వ్యాది భారిన పడి ఇప్పటికే 20 లేగదూడలు మృతి చెందినట్లు సమచారం. దూడలతో పాటు మిగిలిన తెల్లజాతి పశువుల్లో సైతం అక్కడక్కడ వ్యాధి లక్షణాలు గుర్తిస్తున్నారు. వ్యాధి ప్రబలుతుండటంతో పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యాధి ప్రబలకుండా అడ్డుకట్ట వేసేందుకు పశుసంవర్దకశాఖ చర్యలు ఆరంభించింది.
నివారణ చర్యలు
చేపట్టాం
జిల్లాలోని కొన్ని చోట్ల లేగదూడల్లో లంపీస్కిన్ వ్యాధి లక్షణాలు ఇటీవల గుర్తించాం. లక్షణాలు ఉన్న లేగదూడలు, కోడెలకు చికిత్సలు చేశాం. ఏ గ్రామాల్లో అయితే ఎక్కువగా దూడలు, కోడెలకు ఈవ్యాధి వచ్చిందో మిగిలిన తెల్లజాతి పశువులు వ్యాధి భారిన పడకుండా ముందస్తుగా గోట్ ఫాక్స్ వ్యాక్సిన్ వేస్తున్నాం. లింపీస్కిన్ వ్యాధి రాకుండా ప్రతి ఏడాది ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించి గోట్ ఫాక్స్ వ్యాక్సిన్‌ను వేస్తున్నాం. అప్పుడు పాడి రైతులు తప్పక తమ పశువులకు వ్యాక్సిన్ వేయించాలి. – డాక్టర్ వెంకటేశ్వర్లు,
జిల్లా పశుసంవర్దకశాఖ అధికారి
కలవరపెడుతున్న వ్యాధి
లంపీ స్కిన్ వ్యాధి క్యాట్రీ ఫ్యాక్స్ అనే వైరస్ నుంచి వస్తుంది. ఆవులు, ఎద్దులు, లేగదూడల్లో ఈ వ్యాధి సోకుతుంది. బాహ్య పరాన్న జీవులు, వ్యాధిన్న పశువు తాగిన నీరు, తిన్న గడ్డి వల్ల ఇతర పశువులకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది. 104 నుంచి 106 డిగ్రీల జ్వరం, మేత మందగించడం, చర్మంపై బొబ్బలు రావడం వ్యాధి ప్రధాన లక్షణాలుగా చెప్పవచ్చు. ముందుగా దేశంలో గుజరాత్, మహారాష్ట్రలో ఈవ్యాధిని గుర్తించారు. సంతల్లో, మార్కెట్‌లలో పశువుల క్రయ, విక్రయాలు జరుగుతుంటాయి. ఒక రాష్ట్రం రైతులు మరో రాష్ట్రానికి వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. ఈక్రమంలోనే మన రాష్ట్రంలోనూ 2022లో పలు ప్రాంతాల్లో పశువులకు ఈవ్యాధి లక్షణాలు బయటపడ్డాయి.
2022లో జిల్లాలో గుర్తింపు
2022 ఆగస్టులో జిల్లాలో లంపీస్కిన్ వ్యాధి లక్షణాలు పలు ప్రాంతాల్లో పశువుల్లో అగుపించాయి. రైతులు ఆందోళన చెంది పశువైద్యాధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పశుసంవర్ధకశాఖ పశువులను పరిశీలించి, ముందస్తు టీకాలు వేశారు. అయితే ఆ తర్వాత 2023 జూలై నెలలో పలు ప్రాంతాల్లో పశువుల్లో లంపీ స్కిన్ వ్యాధి లక్షణాలు అగుపించాయి. దీంతో పశుసంవర్ధకశాఖ అప్రమత్తమైంది. వంద మంది సిబ్బందితో మండలానికి మూడు బృందాలుగా ఏర్పాటు చేసి గోట్ ఫాక్స్ వ్యాక్సిన్‌ను పశువులకు వేశారు. కాగా 2024 జులైలో, 2025 మేనెలలో వ్యాధి రాకుండా ముందస్తుగా వ్యాక్సిన్ వేశారు.
జిల్లాలో తెల్లజాతి పశువుల వివరాలిలా..
మరికొన్ని
లేగదూడల్లో వ్యాధి లక్షణాలు
అప్రమత్తమైన పశువైద్య సిబ్బంది
గోట్ ఫాక్స్ వ్యాక్సిన్ వేస్తున్న వైనం

‘లంపీస్కిన్’ కలకలం..!

‘లంపీస్కిన్’ కలకలం..!