
బీచుపల్లి పుణ్యక్షేత్రంలో అమావాస్య పూజలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని ఆలయాల్లో భక్తులు ఆదివారం మహాలయ అమావాస్యను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే పెద్ద ఎత్తున ప్రజలు బీచుపల్లికి చేరుకొని అభయాంజనేయస్వామిని, శివాలయం, కోదండరామస్వామి, సరస్వతీదేవి ఆలయాలను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.
నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు
బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయంతో పాటుగా కోదండరామ స్వామి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవోలు రామన్‌గౌడ్, సురేంద్ర రాజు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. పది రోజుల పాటు వైభవంగా జరిగే ఇ ట్టి ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకోవాలని కోరారు.

బీచుపల్లి పుణ్యక్షేత్రంలో అమావాస్య పూజలు