
ఓటర్ జాబితా సమర్థవంతంగా పూర్తి చేయాలి
గద్వాల: 2002–2025 ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించి సరిపోల్చే ప్రక్రియను సమర్ధవంతంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అధికారులకు ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని ఓటర్ జాబితా సరిపోల్చే ప్రక్రియ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2002–2025 ఓటరు జాబితా సరిపోల్చే కార్యక్రమాన్ని సమర్ధవంతగా నిర్వహించి ఓటరు జాబితా సరిపోల్చటంలో రెవెన్యూ గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని పరిశీలించాలని, ఓటరు జాబితా సక్రమంగా నిర్వహించేందుకు నాలుగు కేటగిరీలుగా విభజించడం జరిగిందని తెలిపారు. ఓటరు వర్గీకరణ ప్రకారం 2002 జాబితాలో ఉన్నవారిని సీ 18–21 మధ్య ఉన్న వారిని బి 22–37 మద్య వయస్సు ఉన్నవారిని సీ 18–21 మధ్య ఉన్న వారిని డీ కేటగిరిలో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలోని ఆర్టీఓ అలివేలు, అన్ని మండలాల తహసీల్ధార్లు, ఉన్నారు.