
డీఎస్పీ నవీన్‌కు ఘన సన్మానం
వెంకటాపురం(ఎం): మండల కేంద్రానికి చెందిన దానం నవీన్ ఇటీవల వెల్లడించిన గ్రూప్–1లో ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికయ్యారు. ఈ మేరకు అదివారం మండల కేంద్రంలో నవీన్‌ను కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరి అయిలయ్య మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టిన నవీన్ కలెక్టర్ కావాలనే లక్ష్యంతో తన మేనమామ సమ్మయ్య సహకారంతో చదివి డీఎస్పీగా ఎంపిక కావడం అభినందనీయమన్నారు. ప్రతిఒక్కరూ నవీన్‌ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు మామిడిశెట్టి నవనీత్, నాయకులు రాజు, రాజేష్, వెంకటేశ్, తిరుపతి, సమ్మయ్య పాల్గొన్నారు.