రేపటి ప్రజావాణి రద్దు | - | Sakshi
Sakshi News home page

రేపటి ప్రజావాణి రద్దు

Oct 5 2025 5:04 AM | Updated on Oct 5 2025 5:04 AM

రేపటి

రేపటి ప్రజావాణి రద్దు

భూపాలపల్లి: కలెక్టరేట్‌లో రేపు (సోమవారం) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్‌ రాహుల్‌శర్మ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రజావాణిని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు గమనించి ఫిర్యాధులు ఇవ్వడానికి ఐడీఓసీ కార్యాలయానికి రావద్దని ఆయన సూచించారు.

భర్త ఇంటి ముందు దీక్ష

భూపాలపల్లి అర్బన్‌: కాపురానికి తీసుకెళ్లకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఓ వివాహిత తన భర్త ఇంటి ఎదుట శనివారం దీక్ష చేపట్టింది. వివాహిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గణపురం మండలం అప్పయ్యపల్లి గ్రామానికి చెందిన ఎలుకేటి రవి–లక్ష్మి దంపతుల కూతురు రమను 2021 సంవత్సరంలో రూ.20లక్షల కట్న కానుకలతో భూపాలపల్లికి చెందిన ఆరెపల్లి శ్రీనివాస్‌తో వివాహం జరిపించారు. కొంత కాలం తర్వాత ఆమెను కాపురానికి తీసుకెళ్లకుండా విడాకులు ఇస్తానంటూ, ఇబ్బందులు పెడుతున్నాడు. ఇంట్లోకి రా నివ్వడం లేదు. విడాకుల కోసం కోర్టు ద్వారా నోటీసులు పంపించాడు. విసుగు చెందిన రమ తల్లిదండ్రులతో పాటు 20 మంది మహిళలు, బంధువులు శనివారం శ్రీనివాస్‌ ఇంటిలోకి వెళ్లే ప్రయత్నం చేయగా ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకోని భర్త శ్రీనివాస్‌, శ్రీనివాస్‌ తండ్రిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లారు.

9 నుంచి లా సప్లిమెంటరీ పరీక్షలు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఐదేళ్ల లా కోర్సు మూడో సెమిస్టర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 9వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆసింఇక్బాల్‌ తెలిపారు. ఈనెల 9న మొదటి పేపర్‌, 13న రెండో పేపర్‌, 15న మూడో పేపర్‌, 17న నాలుగో పేపర్‌ ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.

ప్రయాణికులకు

సౌకర్యాలు కల్పించాలి

హన్మకొండ: ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వై.నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ ఉప్పల్‌లో వరంగల్‌ రీజియన్‌ బస్సులు నిలిచే బస్‌ పాయింట్‌ను శనివారం ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్‌, వెంకన్న, చీఫ్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ శ్రీధర్‌, వరంగల్‌ రీజినల్‌ మేనేజర్‌ డి.విజయభానుతో కలిసి ఎండీ వై.నాగిరెడ్డి సందర్శించారు. ప్రయాణికులు కూర్చోవడానికి స్థలం, బస్సులు నిలుపు స్థలం, పార్కింగ్‌ స్థలాన్ని పరిశీలించారు. వీటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

ఆలయ నిర్మాణ పనులు షురూ..

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభించారు. శనివారం సమ్మక్క– సారలమ్మ గద్దెల చుట్టూ ప్రహరీ(సాలాహారం) నిర్మాణ పనులను చేపట్టేందుకు చెట్లను, పిచ్చి మొక్కలను జేసీబీతో తొలగించి శుభ్రం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రహరీని అలాగే ఉంచి నూతనంగా నిర్మించిన అనంతరం పాత ప్రహరీని తొలగించనున్నారు. రాతితో ప్రహరీ నిర్మాణం పనులు మొదలు కానున్నాయి.

రేపటి ప్రజావాణి రద్దు
1
1/1

రేపటి ప్రజావాణి రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement