
ఘనంగా మహా పూర్ణాహుతి
మహిషాసుర మర్దినిగా అమ్మవార్ల దర్శనం
కాళేశ్వరం: శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆల య అనుబంధ దేవాలయాలైన శ్రీఽశుభానందదేవి(పార్వతి), శ్రీసరస్వతి అమ్మవార్లు 10వ రోజు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం ఆలయ అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో ఆలయంలో విశేష అభిషేక పూజలు చేశారు. అమ్మవార్లను ప్రత్యేకంగా పట్టువస్త్రాలు, పూలతో అలంకరించారు. రాత్రి మంత్రపుష్పం పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు. భజన కార్యక్రమాలు చేశారు.
ఘనంగా మహా పూర్ణాహుతి..
శీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం మహర్నవమిని పురస్కరించుకొని ఆలయ యాగశాలలో మహా పూర్ణాహుతి హోమం కార్యక్రమం ఆలయ ఉపప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ–శృతి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఈఓ మహేష్, భక్తులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా పాల్గొన్నారు. అనంతరం గందెసిరి మధుసూదన్–రమాదేవి దంపతులు భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. వారిని ఈఓ మహేష్ శాలువాతో సన్మానించారు.
శ్రీశుభానందదేవి అమ్మవారు, శ్రీసరస్వతి అమ్మవారు

ఘనంగా మహా పూర్ణాహుతి

ఘనంగా మహా పూర్ణాహుతి