
ప్రాధాన్యం రంగాలకు అధిక రుణాలు
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ప్రజలు కోరుకున్న ప్రాధాన్యం రంగాలకు అధిక రుణాలు అందించా లని, రుణ లక్ష్యసాధనకు సమన్వయం అవసరమ ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో బ్యాంకర్లు, అధికారులతో జిల్లా కోఆర్డినేషన్ కమిటీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పంట రుణ లక్ష్యం రూ.1,221.72 కోట్లు కాగా అందులో రూ.136.74 కోట్లు రుణ లక్ష్యం సాధించారన్నారు. రుణ లక్ష్య సాధనలో మరింత ప్రగతి సాధించేందుకు బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో పంట రుణాలు, ఎంఎస్‌ఎంఈ, హౌసింగ్, ఎడ్యుకేషన్, వ్యవసాయ రుణాలను సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు అమలులో లబ్ధిదారులకు ఎ లాంటి జాప్యం లేకుండా రుణాలు అందించాలన్నా రు. ఆయా బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న యూని ట్లను బ్యాంకు అధికారులతో తరచూ సంప్రదించి రుణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రికవరీ శాతా న్ని పెంచేందుకు అధికారులు గ్రామ స్థాయిలో లబ్దిదారులకు అవగాహన పరిచే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మహిళాశక్తిలో స్వయం సహాయక సంఘాల మహిళలకు మోడల్ సీఎస్‌సీ సెంటర్స్ ప్రతీ మండలానికి ఒకటి చొప్పున ఏ ర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఆర్‌బీఐ ఎల్‌డీఓ యశ్వంత్‌సాయి, నాబార్డ్ డీడీఎం చంద్రశేఖర్, యూబీఐ డీజీఎం, టీజీబీ ఆర్‌ఎం, జిల్లా అధికారులు, ఎల్‌డీఎం తిరుపతి, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.