
అధికారులు బాధ్యతగా పనిచేయాలి
● అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్
స్టేషన్‌ఘన్‌పూర్: మున్సిపల్, మండల పరిషత్ అధికారులు బాధ్యతగా పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులు, సిబ్బందితో మాట్లాడుతూ.. సమన్వయంతో పనిచేయాలని, ప్రధానంగా పారిశుద్ధ్యం, డ్రైనేజీల విషయమై శ్రద్ధ వహించాలని ఆదేశించారు. అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయశ్రీ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.