
ప్రయాణం ప్రయాసే..
దసరా సెలవులు ముగించుకుని పట్టణ బాట పడుతున్న కుటుంబాలకు ప్రయాణంలో ప్రయాస తప్పడం లేదు. నేటి(సోమవారం) నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. 15 రోజులపాటు స్వగ్రామాల్లో ఎంజాయ్ చేసిన కుటుంబాలు ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో జనగామ ఆర్టీసీ బస్టాండ్‌లో రికార్డు స్థాయిలో ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసింది. రద్దీకి అనుగుణంగా అదనపు బస్సు సర్వీసులు నడిపించినప్పటికీ, ఒక్కో బస్సులో ఒంటికాలుపై నిలబడి 100 మందికి పైగా వెళ్లాల్సి వచ్చింది.
– జనగామ
జనగామ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ

ప్రయాణం ప్రయాసే..