
రామప్పలో కోలాహలం
వెంకటాపురం(ఎం): ప్రపంచప్రఖ్యాతి గాంచిన సుప్రసిద్ధ రామప్ప దేవాలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చి రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్‌లు విజయ్‌కుమార్, వెంకటేశ్ వివరించారు.
వనదేవతలకు మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కల్యాణకట్టలో పుట్టువెంట్రుకలను సమర్పించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల వద్ద పూజలు చేశారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లోని చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు చేశారు.

రామప్పలో కోలాహలం