
మెరుగైన వైద్యసేవలందించాలి
జఫర్‌గఢ్: ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యసేవలందించే విషయంలో వైద్యులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.రవీందర్‌నాయక్ కోరారు. మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలను ఆయన శనివారం అకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడారు.. ఆరోగ్య పరిస్థితి, ఆసుపత్రి ద్వారా అందుతున్న వైద్యసేవలపై వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి పనితీరు, డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈసందర్భంగా వైద్యులు, వైద్య సిబ్బందితో సమీక్షించడంతో పాటు పలు సూచనలు చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యసేవలందించే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్‌రావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు డాక్టర్ సుధీర్, డాక్టర్ శ్రీదేవి, డీఐఓ స్వర్ణకుమారి, వైద్యులు రాజమల్లు, నరేందర్, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ రవీందర్‌నాయక్