
శ్రీసోమేశ్వర ఆలయానికి ‘శంఖదార’ సమర్పణ
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం వెండి శంఖదారను భక్తుడు సమర్పించినట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు తెలిపారు. స్వామివారి పూజాకార్యక్రమాల్లో అభిషేకం నిర్వహించడానికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడు మెతుకు సంతోష్‌కుమార్, సుధ దంపతులు రూ.60,000ల విలువైన 500 గ్రాముల మిశ్రమ వెండితో శంఖదార తయారుచేయించి అందజేసినట్లు ఈవో పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న, అర్చకులు డీవీఆర్‌శర్మ, దేవగిరి అనిల్‌కుమార్, మత్తగజం నాగరాజు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
దసరా ఉత్సవాల్లో జాతీయ జెండావిష్కరణ
లింగాలఘణపురం: మండలంలోని వనపర్తి, నెల్లుట్ల గ్రామాల్లో దసరా పండగ సందర్భంగా గురువారం జాతీయ జెండాలను ఆవిష్కరించారు. విజయానికి సూచికగా జరుపుకొనే దసరా ఉత్సవాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి జరుపుకోవడం ఆయా గ్రామాల్లో ఆనవాయితీగా వస్తోంది. అందులో వనపర్తిలో మాజీ సర్పంచ్ శ్రీధర్, ఎంపీటీసీ రాజిరెడ్డి, నాయకులు శంకరయ్య, కుమారస్వామి, సుదర్శన్‌రెడ్డి, మహేశ్, శ్రీనివాస్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నెల్లుట్లలో చిట్ల ఉపేందర్‌రెడ్డి జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
రామప్ప శిల్పకళాసంపద అద్భుతం
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళాసంపద అద్భుతమని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన సతీమణి వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. గైడ్ తాడబోయిన వెంకటేష్ ఆలయ విశిష్టత గురించి వివరించగా రామప్ప శిల్పాకళాసంపద బాగుందని వారు కొనియాడారు, కార్యక్రమంలో టీజీఎన్పీడీసీఎల్ ములుగు డీఈ నాగేశ్వర్‌రావు, విద్యుత్ అధికారులు వేణుగోపాల్, రమేష్, సాంబరాజు, సురేష్, కృష్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.
రుద్రేశ్వరాలయంలో త్రిశూల తీర్థోత్సవం
హన్మకొండ కల్చరల్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలోని ప్రాచీన కోనేటిలో త్రిశూల తీర్థోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అధ్వర్యంలో అర్చకులు మణికంఠశర్మ, సందీప్‌శర్మ, ప్రణవ్ రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం చేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు చేసి రాజరాజేశ్వరీదేవిగా అలంకరించారు. గంగు ఉపేంద్రశర్మ శ్రీరుద్రేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహం, త్రిశూలం, ఆయుధాలను పూజించిన అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి దేవాలయంలోని ప్రాచీన కోనేరులో శ్రీసూక్తవిధానంతో అవబృధస్నానం, జలాధివాసం నిర్వహించారు. అనంతరం శ్రీరుద్రేశ్వరీదేవి ఉత్సవమూర్తిని తిరిగి నిత్యపూజా కై ంకర్యాల కోసం దేవాలయంలో రుద్రేశ్వరుడిని సన్నిధిలో ప్రతిష్ఠించారు. త్రిశూల స్నానంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీసోమేశ్వర ఆలయానికి ‘శంఖదార’ సమర్పణ