
మహాత్ముడికి ఘన నివాళి
జనగామ: గాంధీ జయంతి పురస్కరించుకుని గురువారం జనగామ పట్టణంలోని కృష్ణకళామందిర్ జంక్షన్‌లోని గాంధీ విగ్రహానికి గురువారం కలెక్టర్ షేక్ రిజ్వాన్‌న్ బాషా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులతో కలిసి రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ గాంధీ మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, నాయకులు బక్క శ్రీనివాస్, మంత్రి శ్రీశైలం, గాదెపాక రాంచంద్రంతో కలిసి ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్య పట్టణ కార్యదర్శి గట్టు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధి పజ్జూరి జయహరి, బెల్దె శ్రీధర్, శివరామకృష్ణ, గట్టు శ్రీనివాస్, మిరియాల రమేశ్, దేవునూరి వెంకటేశ్వర్లు, దోస పాటి శ్రీనివాస్ తదితరులు బాపూజీకి నివా ళులర్పించారు. పిరమిడ్ స్పిర్చువల్ సీనియర్ మాస్టర్ రాజేందర్, గుంటిపల్లి మల్లికార్జున్ ఆధ్వర్యంలో మనిషి మేలుకో, జీవహింస మానుకో అనే నినాదంతో ప్రచారం, ర్యాలీ చేపట్టారు.

మహాత్ముడికి ఘన నివాళి

మహాత్ముడికి ఘన నివాళి