
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
● రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క
ములుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పిలుపునిచ్చారు. ఇంచర్లలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం సమష్టిగా పనిచేయాలన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందేమిలేదని ఆరోపించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు.