
బాధితులకు భరోసా కల్పించాలి
వరంగల్ క్రైం: పదోన్నతులతో బాధ్యతలు కూడా పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైలుగా పదోన్నతి పొందిన ఎం.సాంబరెడ్డి, పి.జైపాల్, పి.లక్ష్మారెడ్డి, డి.వెంకటేశ్వర్లు, ఎం.సాంబయ్య, కె.వెంకన్న, డి.సమ్మిరెడ్డి, ఎం.లక్ష్మీనారాయణ, పి.శ్రీనివాస్ రాజు, ఎస్.సదయ్య ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనర్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ పదోన్నతి పొందిన అధికారుల భుజాలపై నక్షత్రాలను అలంకరించి అభినందనలు తెలిపారు. అనంతరం సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు పోలీసులు భరోసా, నమ్మకాన్ని కలిగించాలన్నారు.
జాతీయస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు ఎంపిక
జనగామ రూరల్: ఈనెల 25 నుంచి 27తేదీ వరకు హైదరాబాద్‌లో జరిగిన 69వ ఎస్‌జీఎఫ్ టోర్నమెంట్ చాంపియన్‌షిప్ పోటీల్లో పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకులం విద్యార్థి పర్వతం విక్రమ్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. జాతీయస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు ఎంపిక అయ్యాడని కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ నర్సింహులుగౌడ్ అదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి విక్రమ్‌ను కోచ్ లింగ్యానాయక్, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎ.కిషన్, పీఈటీ వేణు, అధ్యాపకుడు వేణుమాధవ్ అభినందించారు. వచ్చే నెల 5నుంచి 8వ తేదీ వరకు జమ్మూకశ్మీర్‌లో జాతీయస్థాయి ఫుట్‌బాల్ క్రీడల్లో విక్రమ్ పాల్గొననున్నాడు.
భగత్‌సింగ్ స్ఫూర్తితో పోరాటాలు
జనగామ రూరల్: భగత్‌సింగ్ స్ఫూర్తితో విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం యువత పోరాటాలకు సిద్ధం కావాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.తిరుపతి పిలుపునిచ్చారు. అదివారం జిల్లా అధ్యక్షుడు ధర్మబిక్షం అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. అహర్నిశలు కష్టపడి చదువుకున్న చదువుకు ఉపాధి దొరకక యువత చెడు మార్గాలకు, వ్యసనాలకు బానిసలు అవుతున్నారన్నారు. దేశంలో కులమత ప్రాంత రాజకీయాలు పెరిగిపోయాయని, అందుకే స్వచ్ఛమైన రాజకీయాల కోసం ఉద్యమించాలన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా బానోత్ ధర్మబిక్షం, కార్యదర్శిగా బొడ నరేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పంతం సాయిప్రసాద్, ఉపాధ్యక్షులుగా నిరేటి సంపత్, చింతకింది అజయ్, సహాయ కార్యదర్శిగా పోత్కునురి కనకచారి తదితరులు ఎన్నికయ్యారు.

బాధితులకు భరోసా కల్పించాలి

బాధితులకు భరోసా కల్పించాలి