
విశ్రాంత ఉద్యోగుల సంఘం ఎన్నిక
జనగామ: జనగామ యూనిట్ రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సంఘం నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. సంఘ జిల్లా అధ్యక్షుడు ఎన్.మహేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో మాజీ జిల్లా అధ్యక్షుడు రామన్న, మాజీ రాష్ట్ర బాధ్యులు వి.యాదవరెడ్డి, సీనియర్ సభ్యులు టి.మల్లికార్జున్, బి.శంకరయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జనగామ యూనిట్ నూతన అధ్యక్షుడిగా కసిరెడ్డి మహబూబ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొక్కొండ జగదీశ్వరాచారి, ఆర్థ్కి కార్యదర్శి హుస్సేన్ రియాజుల్లా, అసోసియేట్ అధ్యక్షుడు వి.విజయ్‌కుమార్, ఉపాధ్యక్షుడు అజం అలీ, మహిళా ఉపాధ్యక్షురాలు జి.ఉమాదేవి, సంయుక్త కార్యద్శి టి.జ్ఞానేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.లక్ష్మణ్, ప్రచార కార్యదర్శి బి.కృష్ణమూర్తి, జిల్లా కౌన్సిలర్లు జి.రమాదేవి, ఎం.నిరంజన్‌రెడ్డి, వి.విమలాదేవి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో చాడ వెంకట్‌రెడ్డి, సీహెచ్ రవీందర్‌రెడ్డి, కె.బాలయ్య, సీతారామారావు, రాజయ్య, సిద్దిమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.