అన్నదాతలకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

అన్నదాతలకు అండగా ఉంటాం

Sep 28 2025 7:26 AM | Updated on Sep 28 2025 7:26 AM

అన్నద

అన్నదాతలకు అండగా ఉంటాం

డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి

బచ్చన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. శనివారం మండలకేంద్రంలోని శ్రీనివాస గార్డెన్‌లో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని తక్కువ వర్షపాతం నమోదు కావడంతో చెరువులు కుంటలు నిండలేదన్నారు. ప్రస్తుతం గోదావరి జలాలతో అన్ని చెరువులను నింపుతున్నామన్నారు. త్వరలో జరగబోవు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగిటి విద్యానాథ్‌, మసూద్‌, హరిబాబు, పిన్నింటి కావ్యశ్రీ, నారాయణరెడ్డి, శ్రీనివాస్‌, స్వామి, రాములు, కృష్ణ, రమేష్‌, ఆగయ్య, పలువురు పాల్గొన్నారు.

వ్యాపారులు భద్రత

ప్రమాణాలు పాటించాలి

జనగామ రూరల్‌: వ్యాపారులు ఆహార భద్రతా ప్రమాణాలను పాటించాలని మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. శనివారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలో ప్రధానమంత్రి లోక్‌ కల్యాణ్‌ మేళ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా పట్టణ ఆహార పదార్థాలను విక్రయించే వీధి విక్రయదారుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధి వ్యాపారులు ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. నిబంధనల ప్రకారం ఆహార పదార్థాల తయారీ, నిల్వ, రవాణా, విక్రయ ప్రక్రియలో పాటించాల్సిన నిబంధనలు గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్‌ శైలజ, జిల్లా కోఆర్డినేటర్‌ రమేష్‌ నాయక్‌, పట్టణ కోఆర్డినేటర్‌ వాణిశ్రీ, ఆర్గనైజర్లు తిరుమల, షాహిన్‌, డేటా ఆపరేటర్‌ రేణుక, వ్యాపారులు పాల్గొన్నారు.

అక్టోబర్‌ 2న మాంసం అమ్మకాలు నిషేధం

జనగామ: అక్టోబర్‌ 2వ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకుని జనగామ పట్టణంలో మాంసం (మటన్‌, చికెన్‌) విక్రయాలను నిషేధించినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. శనివారం కమిషనర్‌ మాట్లాడుతూ 2వ తేదీన జీవహింస చేయరాదని, చికెన్‌, మటన్‌ దుకాణాలను మూసి వేయాలన్నారు. తమ ఆదేశాలను దిక్కరించి అమ్మకాలు చేస్తే 2019 యాక్ట్‌ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ముగిసిన రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ పోటీలు

జనగామ: జిల్లా కేంద్రం సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులంలో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ 69వ అండర్‌ 19 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు శనివారంతో ముగిశాయి. రాష్ట్రంలోని ఆయా జిల్లా నుంచి వచ్చిన టీంలు హోరా హోరీగా తలపడ్డాయి. ఇందులో హైదరాబాద్‌ (ప్రథమ), మహబూబ్‌నగర్‌ (ద్వితీయ), వరంగల్‌(తృతీయ) స్థానంలో నిలిచి సత్తా చాటుకున్నాయి. వచ్చే నెల 5 నుంచి 10వ తేదీ వరకు జమ్మూ కాశ్మీర్‌లో జరిగే జాతీయ స్థాయి టోర్నమెంట్‌లో పాల్గొంటారని నిర్వాహకులు అజ్మీరా కిషన్‌ నాయక్‌ తెలిపారు. గురుకులం ప్రిన్సిపాల్‌ చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో కోచ్‌, నిర్వాహకులు, సహాయకులు మనోజ్‌ కుమార్‌, ఏ.కిషన్‌ తదితరులు ఉన్నారు.

తెలంగాణ వసతి గృహ అధికారుల ఫోరం ఎన్నిక

జనగామ: తెలంగాణ వసతి గృహ అధికారుల ఫోరం ఎన్నికలు శనివారం టీఎన్జీవోస్‌ కార్యాలయంలో జిల్లా జేఏసీ చైర్మన్‌, టీఎన్జీవోస్‌ యూ నియన్‌ అధ్యక్షుడు ఖాజా షరీఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఫోరం అధ్యక్షుడిగా చింత రాంనర్సయ్య, కార్యదర్శిగా మల్లు, కోశాధికారిగా ఎండీ మొయిన్‌, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా దే వేందర్‌, ఉపాధ్యక్షులుగా యాకయ్య, అనిల్‌, తి రుమల, జాయింట్‌ సెక్రటరీలుగా సృజన, అని త, నిర్మల, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా మహేందర్‌, పబ్లిసిటీ సెక్రటరీగా వెంకటేష్‌తోపాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అన్నదాతలకు  అండగా ఉంటాం
1
1/2

అన్నదాతలకు అండగా ఉంటాం

అన్నదాతలకు  అండగా ఉంటాం
2
2/2

అన్నదాతలకు అండగా ఉంటాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement