
పోరాట యోధుడు లక్ష్మణ్ బాపూజీ
● ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్
జనగామ రూరల్: తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని వదిలేసి తొలి పోరాటయోధుడిగా గుర్తింపు పొందిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేష్‌కుమార్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ బెన్ షాలోమ్‌తో కలిసి బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనటమే కాకుండా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మహనీయుడని, కులవృత్తులను ప్రోత్సహించారని వారి జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పొందుపరిచేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల బాలరాజు, పోపా జిల్లా అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు ఏలే జనార్దన్, కార్యదర్శి బత్తిని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మదాసు ఎల్లయ్య, డాక్టర్ కల్నల్ మాచర్ల భిక్షపతి, నాయకులు పాల్గొన్నారు.