
బతుకమ్మ సంబురాలు
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి వివిధ కుల సంఘాల నాయకులు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఎన్.ఎల్. నరసింహారావు, సహాయ బీసీ సంక్షేమాధికారి బి.రవీందర్, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మదార్, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షుడు ఎదునూరి నరేశ్, డాక్టర్ కల్నల్ భిక్షపతి, ఏఎంసీ చైర్మన్ శివరాజ్ యాదవ్, దిశ సభ్యులు శ్రీనివాస్, ఆర్టీఏ సభ్యులు అభి గౌడ్ , రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఉపేందర్, లింగాలగణపురం మండల రజక సంఘం అధ్యక్షుడు రాజు, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు వేముల బాలరాజు, గీత కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు వెంకటమల్లయ్య పాల్గొన్నారు.