
మహాకవులకు నిలయం పాలకుర్తి
పాలకుర్తి టౌన్: తెలుగు సాహిత్య చరిత్రలో పాలకుర్తి ఓ మహోన్నత స్ధానాన్ని సంపాదించిందని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కొనియాడారు. శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలోని సోమనాథ కళాపీఠం అధ్యక్షుడు, సాహితీవేత్త డాక్టర్ రాపోలు సత్యనారాయణ ఇంట్లో మీడియాతో మాట్లాడారు.. పాలకుర్తి నేల నిజమైన మహాకవుల నిలయం అని, ఈ నేలలో పుట్టిన మహనీయులు తెలుగు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశారని అన్నారు. పాల్కురికి సోమనాథుడు తన బసవపురాణంతో సమాజంలో సమానత్వం సందేశం చాటారని, బమ్మెర పోతన తన ఆధ్యాత్మిక గాఽథలో ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా చిలిచారని, వాల్మీకి తన సృష్టితో ధర్మాన్ని ప్రతిష్టించాడని అన్నారు. స్థానిక యువత ఈ వారసత్వాన్ని ఆదర్శంగా తీసుకొని తమ ప్రతిభను పెంపొందించుకోవాలన్నారు. ఈనేల సాహిత్య వారసత్వాన్ని రక్షించడం కోసం సోమనాథ కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ కృషి అభినందనీయం అన్నారు.
ఎమ్మెల్సీ గోరటి వెంకన్న