
చట్టాలపై అవగాహన ఉండాలి
జనగామ రూరల్: విద్యార్థులకు రాజ్యాంగం, చట్టాలపై తప్పనిసరిగా అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆదేశాల మేరకు గురువారం పట్టణంలోని ఏకశిలా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని దేశంలోని ప్రతి పౌరుడు తెలుసుకొని అనుసరించాలని, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తే శిక్ష తప్పదు అని అన్నారు. ప్రాథమిక విధులు, బాధ్యతలు గురించి తప్పకుండా తెలుసుకోవాలని అలాగే పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపల్ ఎ. మల్లికార్జునరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ జి.నళిని కుమారి, డైరెక్టర్ బి.నాగరాజు, బి.శేఖర్, పి.జితేంద్ర పాల్గొన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్