
క్రీస్తుజ్యోతిలో బతుకమ్మ సంబురాలు
జనగామ: మండలంలోని యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం బతుకమ్మ సంబురాలను జరుపుకున్నారు. బతుకమ్మల ను తీర్చిదిద్ది కళాశాల ఆవరణలో సాయంత్రం నుంచి రాత్రి వరకు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డి.విజయపాల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా సంప్రదాయ, ఆచార వ్యవహారాలను సైతం గౌరవించాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యాపకులు స్వప్న, సంతోశాకుమారి, స్వర్ణ, సరితా, మాలతి, గీత, విద్యార్థినులు పాల్గొన్నారు.