నేటినుంచి మద్యం టెండర్లు | - | Sakshi
Sakshi News home page

నేటినుంచి మద్యం టెండర్లు

Sep 26 2025 6:24 AM | Updated on Sep 26 2025 6:24 AM

నేటినుంచి మద్యం టెండర్లు

నేటినుంచి మద్యం టెండర్లు

మండలాల వారీగా మద్యం దుకాణాలు, రిజర్వేషన్లు

కొత్త పాలసీ ఇలా

కొత్తగా మూడు వైన్స్‌లు

నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

జనగామ: జిల్లాలో నూతన మద్యం దుకాణాల టెండరు ప్రక్రియ మొదలుకానుంది. వైన్స్‌ల కేటాయింపులో రిజర్వేషన్ల ప్రాసెస్‌ గురువారం పూర్తికాగా, ఈనెల 26 (శుక్రవారం) నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఎకై ్సజ్‌ శాఖ సన్నద్ధమవుతోంది. ప్రస్తుత దుకాణాల కాలపరిమితి ఈ ఏడాది నవంబర్‌ చివరి వారంతో ముగియనుండగా, ప్రభుత్వం ముందస్తుగా కొత్త టెండర్లను ఆహ్వానిస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 47 మద్యం దుకాణాలు ఉండగా, ఈసారి మరో మూడు కొత్త దుకాణాలు పెరగడంతో మొత్తం సంఖ్య 50కి చేరింది. వీటిలో ఎస్టీ వర్గానికి 1, ఎస్సీ సామాజిక వర్గానికి 5, గౌడ కులస్థుల కు 13, జనరల్‌ కేటగిరీ(ఓపెన్‌) విభాగంలో 31 మ ద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించా రు. దీంతో ప్రస్తుత వైన్స్‌ యజమానులతో పాటు కొత్త ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న ఆయా వర్గాల వారు టెండర్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

కలెక్టరేట్‌లో లాటరీ ప్రక్రియ

నూతన మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్ల కోసం గురువారం కలెక్టరేట్‌లో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. జిల్లా ఎకై ్సజ్‌ అధికారి అనిత, ఏఈఎస్‌ ప్రవీణ్‌, ఎస్‌సీ, ఎస్‌టీ సంక్షేమ అధికారులతో కలిసి ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ పింకేశ్‌ కుమార్‌ పర్యవేక్షణలో మద్యం దుకాణాల రిజర్వేషన్ల కోసం లక్కీ లాటరీ నిర్వ హించారు. జిల్లాలో 50 మద్యం షాపులకు గాను 19 షాపులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇందులో గౌడ సామాజిక వర్గానికి–13(15 శాతం), ఎస్సీ సామాజిక వర్గానికి–5(10 శాతం), ఎస్టీ సామాజిక వర్గానికి–1(5శాతం) మద్యం దుకాణాలను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. జనరల్‌కు–31 (74శాతం) కేటాయించారు. గౌడ కేటగిరీలో జిల్లాలోని మునిసిపల్‌తో పాటు మండలాల వారీగా మద్యం దుకాణాల వారీగా నెంబర్లు కేటాయించగా, ఏరియాలతో సహా గెజిట్‌లో పొందుపరిచారు.

రిటైల్‌ దుకాణాలకు ఎకై ్సజ్‌ ట్యాక్స్‌

జనాభా ప్రాతిపదికన లిక్కర్‌ దుకాణాలకు ఎకై ్సజ్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో రూ.50లక్షలు, రూ.55లక్షలు, రూ.60 లక్షల స్లాబులు ఉన్నాయి. 5వేల జనాభా కలిగిన ఊర్లకు రూ.50లక్షలు, 5వేల నుంచి 50వేల వరకు రూ.55లక్షలు, 50వేల నుంచి లక్ష వరకు రూ.60లక్షలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. 2025–27 రెండేళ్ల కాలపరిమితి సమయంలో ఆరు సమాన వాయిదాలతో ఎకై ్సజ్‌ పన్ను చెల్లించాలి.

మండలం వెన్స్‌లు జనరల్‌ గౌడ ఎస్‌సీ ఎస్‌టీ

జనగామ 11 06 04 01 –

మునిసిపల్‌

పెంబర్తి 01 01 – – –

లింగాలఘణపురం, 03 01 01 01 –

( నెల్లుట్ల )

నర్మెట 02 01 01 – –

బచ్చన్నపేట 03 02 01 – –

చిల్పూరు 01 01 – – –

(చిన్న పెండ్యాల)

చిల్పూరు 01 – – 01 –

(కరుణాపురం)

స్టే.ఘన్‌పూర్‌ 08 05 02 – 01

తరిగొప్పుల 02 01 01 – –

రఘునాథపల్లి 04 02 – 02 –

పాలకుర్తి 05 03 02 – –

కొడకండ్ల 03 03 – – –

జఫర్‌గడ్‌ 03 03 – – –

దేవరుప్పుల 03 02 01 – –

మొత్తం 50 31 13 05 01

నూతన మద్యం పాలసీలో లైసెన్స్‌ అప్లికేషన్‌ ఫీజు 50శాతం పెంచుతూ రూ.3లక్షలు నిర్ణయించారు. లైసెన్స్‌ కోసం ఇచ్చే డబ్బులను తిరిగి చెల్లించరు. నూతన లైసెన్స్‌ కాలపరిమితి 2025 డిసెంబర్‌ 1 నుంచి 2027 నవంబర్‌ 30 వరకు రెండేళ్ల పాటు అమలులో ఉంటుంది.

జిల్లాలోని జనగామ పట్టణం, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ పరిధిలో మూడు మద్యం దుకాణాలు కొత్తగా పెరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు రికా ర్డు స్థాయిలో పెరగడంతో ఉమ్మడి జిల్లా పరిధిలో మూతబడేందుకు సిద్ధంగా ఉన్న మూడింటిని ఇక్కడకు కేటాయించారు. లాటరీ కార్యక్రమంలో జిల్లా ట్రైబల్‌ అధికారి ప్రేమకళ, బీసీ వెల్ఫేర్‌ అధికారి ఎన్‌.ఎల్‌. నర్సింహారావు, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి బి.విక్రమ్‌,

ఎకై ్సజ్‌ సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.

వచ్చే నెల 18 వరకు గడువు..

23న వైన్స్‌ల కేటాయింపు

లైసెన్స్‌ అప్లికేషన్‌ ఫీజు రూ.3లక్షలు

కలెక్టరేట్‌లో రిజర్వేషన్ల ఖరారు

ప్రక్రియ పూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement