
మైనారిటీ మహిళలకు భరోసా
అర్హులు దరఖాస్తు చేసుకోవాలి
జనగామ రూరల్: మైనారిటీల అభ్యున్నతి కోసం, వారు ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా మైనారిటీ మహిళల ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందించడానికి రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’, ‘రేవంతన్నకా సహారా మిస్కీన్ లే’ పేరుతో వచ్చిన పథకాలు మహిళల ఆర్థిక స్వావలంబన, అట్టడుగు సముదాయాల సామాజిక ఉద్ధరణకు దోహదపడతాయి. ఈనెల 19న సెక్రటేరియేట్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. మొత్తం రూ.30 కోట్ల బడ్జెట్‌తో అమలు చేసే ఈ పథకాలకు దరఖాస్తులు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 6 వరకు టీజీవోబీఎమ్ ఎమ్ ఎస్ ఆన్‌లైన్ ద్వారా స్వీకరించనున్నారు.
ఇందిరమ్మ మైనారిటీ మహిళా
యోజన పథకంతో లబ్ధి
ఒంటరి మహిళలకు
రూ.50 వేల ఆర్థిక సాయం
రేవంతన్న కా సహారా మిస్కీన్ లే
కింద రూ.లక్ష గ్రాంట్
ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. ఆర్థిక ఎదుగుదలకు ఈ పథకాలు ఉపయోగపడనున్నాయి. జిల్లాలో అర్హులైన మైనారిటీలు దరఖాస్తు చేసుకోవాలి.
–జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి
బి.విక్రమ్‌కుమార్