
క్రీడారంగంలో రాణించాలి
జనగామ: విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలో సైతం రాణించి దేశ ప్రతిష్టను నిలబెట్టే విధంగా కష్టపడాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకులంలో గురువారం 69వ రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్ 19 విభాగంలో జరిగిన ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలను ఇన్‌చార్జ్ కలెక్టర్ ప్రారంభించారు. సోషల్ వెల్ఫేర్ ప్రి న్సిపల్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన క్రీడాపోటీల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, జ్యోతి ప్ర జ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో ముని సిపల్ కమిషనర్ మహేశ్వరరెడ్డి, డాక్టర్ కల్నల్ భిక్షపతి, జిల్లా ఫుట్‌బాల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అజ్మీరా కిషన్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు చిట్ల ఉపేందర్‌రెడ్డి, కార్యదర్శి రాజయ్య, మహేంద్రవర్మ, టీజీపేట అధ్యక్షుడు కోర్‌సింగ్, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్, కోచ్‌లు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ శ్రమదానం చేయాలి..
జనగామ రూరల్: పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ శ్రమదానం చేయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ అన్నారు. 17వ స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ కార్యక్రమం అమలులో భాగంగా గురువారం మండలంలోని శామీర్‌పేట్ గ్రామంలో ఏక్ దిన్ ఏ గంట ఏక్ సాత్ అనే కార్యక్రమం పురస్కరించుకొని శ్రమదాన కార్యక్రమం ప్రారంభించి స్వ యంగా పాల్గొన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రామంలో దేవీ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛ పండాల్ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి స్వరూప, జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ కోఆర్డినేటర్ కరుణాకర్, జిల్లా అదనపు పీడీ చంద్రశేఖర్, ఇన్‌చార్జ్ ఎంపీడీవో సంపత్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్
ఇంటర్ డిస్ట్రిక్ ఫుట్‌బాల్ పోటీలు
ప్రారంభం