
‘బెస్ట్ అవైలబుల్’ బిల్లులు విడుదల చేయాలి
జనగామ రూరల్: బెస్ట్ అవైలబుల్ స్కూల్ పెండింగ్ బిల్లులు విడుదల చేసి తమ పిల్లల చదువులకు సహకరించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరా రు. ఈమేరకు గురువారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌కు వినతిపత్రం అందజేశారు. దేవరుప్పుల మండలంలోని కడవెండి సెయింట్ జాన్ బ్రిట్టో హైస్కూల్‌లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 2017 సంవత్సరం అడ్మిషన్లు ఇచ్చారు. కానీ 2021 నుంచి 2025 ఈరోజు వరకు నిధులు విడుదల కాలేదని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరారు.
భూసమస్యల పరిష్కారానికి చర్యలు..
జనగామ రూరల్: భూసమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ అన్నారు. గురువారం స్టేషన్ ఘన్‌పూర్ మండలం శివునిపల్లిలో చేపడుతున్న సాదాబైనామా, భూభారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను ఆకస్మికంగా సందర్శించి అసైన్డ్ భూములు 22–ఏను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్‌కు వినతి