
మోదీతోనే దేశ సమగ్ర అభివృద్ధి
స్టేషన్‌ఘన్‌పూర్: కేంద్రంలో బీజేపీ పాలనలో ప్రధాని నరేంద్రమోదీ ద్వారానే దేశ సమగ్ర అభివృద్ధి చెందుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిశోర్‌రెడ్డి అన్నారు. ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో జీఎస్‌టీపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅ తిథిగా హాజరైన కిశోర్‌రెడ్డి మాట్లాడారు.. జీఎస్‌టీ తగ్గించడం సర్వత్రా హర్షణీయమన్నారు. వెన్నుపోటు రాజకీయాలు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఐకాన్ అని బీజేపీ నేత, మాజీ మంత్రి విజయరామారావు ఆరోపించారు. రాజ్యాంగంపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్, నాయకులు ఇనుగాల యుగేందర్‌రెడ్డి, సట్ల వెంకటరమణ, బూర్ల విష్ణు, ఆరూరి జయప్రకాశ్, శశిధర్‌రెడ్డి, గంటె ఉపేందర్, నవీన్, చట్ల సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అఽధికార ప్రతినిధి కిశోర్‌రెడ్డి