
పండగ పూట ఇల్లు జాగ్రత్త!
జనగామ: బతుకమ్మ, దసరా పండగ సమయంలో ఇంటికి తాళాలు వేసి సుదూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని కోరుతూ బుధవారం జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీతో పాటు ఆయా వార్డుల్లో పోలీసులు మైక్ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేశ్, తదితరులు వార్డుల్లోని ప్రధాన కూడళ్లలో జనాన్ని పోగు చేసి జాగ్రత్తలు సూచించారు. ఇంటికి తాళం వేసి వెళ్లే సమయంలో పోలీసులకు సమాచారం అందించాలని, వార్డులో కొత్త, అనుమానిత వ్యక్తులు సంచరించిన సమయంలో తమకు వెంటనే సమాచారం అందించాలని నరేశ్ కోరారు.