జనగామ: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాండియా కార్యక్రమాలను పవిత్రంగా నిర్వహించుకోవాలని విశ్వహిందూపరిషత్, బజరంగ్‌దళ్ జిల్లా ఉపాధ్యక్షులు బచ్చు బాలనారాయణ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమ్మవారికి ప్రతీ నిత్యం సాంప్రదాయబద్ధంగా పూజలు చేస్తూ, సంస్కృతిని నృత్యాలు చేయడం దాండియా ఉద్దేశ్యమన్నారు. ప్రస్తుత సమయంలో కొంతమంది నిర్వాహకులు దీనిని ఈవెంట్ మేనేజ్‌మెంట్ తరహాలో వాణిజ్యపరంగా చేపట్టడం క్షమించరానిదన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట బౌన్సర్ల రూపంలో ఇతర మతస్తులు ప్రవేశించి అమ్మాయిలపై అసభ్యకర చేష్టలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది లవ్ జిహాద్ వంటి దుష్ప్రవర్తనలకు దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వేడుకల్లో చిన్ని తప్పిదం జరిగినా, విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న దాండియా ఈవెంట్లపై పోలీ సులు నిఘా ఏర్పాటు చేసి, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని కోరారు.
బచ్చన్నపేట: మండలంలోని కట్కూర్ గ్రామానికి చెందిన కరుణారెడ్డికి బుధవారం జేఎన్‌టీయూ యునివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. కరుణారెడ్డి జెఎన్‌టీయూ యూనివర్సిటీలో కెమిస్ట్రీలో ఫుల్‌టైం పరిశోధన చేసి ఇంటర్నేషనల్ జర్నల్స్ పబ్లికేషన్స్‌లో ప్రచురణ పొంది పీహెచ్‌డీ ఽథీసెస్ సమర్పించారు. మూల్యాంకన అనంతరం ఇంటర్వ్యూ నిర్వహించి డాక్టరేట్‌కు అర్హత సాధించారు. 2014లో ఆమె భర్త కరుణాకర్‌రెడ్డి కూడా ఇదే యునివర్సిటీలో గణిత శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. భార్యాభర్తలు ఇద్దరూ డాక్టరేట్ సాధించడంపై గ్రామస్తులు అభినందించారు.
పాలకుర్తి: మండలంలోని చెన్నూరు జెడ్పీ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులు చిలువేరు రేవతి, మంచాల అంజలి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారని హెచ్‌ఎం పుస్కూరి రమేశ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. 25,26,27 తేదీల్లో నిజామాబాద్ జిల్లా మక్తల్ మండలంలో కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఎంపికై న విద్యార్థులను, వారికి సహకరించిన ఫిజికల్ డైరక్టర్ కొడిశాల అశోక్‌ను ఉపాధ్యాయులు శ్రీనివాస్, శోభ, శ్రీహరి, ఉమారాణి, వెంకటేశ్, క్రాంతి కుమార్ అభినందించారు.
ఇద్దరు ఇన్‌స్పెక్టర్ల బదిలీ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎ.ప్రవీణ్‌ను వీఆర్‌కు బదిలీ చేయగా.. ప్రస్తుతం సీసీఆర్‌బీలో విధులు నిర్వహిస్తున్న కె.శ్రీధర్‌రావును ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
దాండియా పవిత్రత కాపాడాలి
దాండియా పవిత్రత కాపాడాలి
దాండియా పవిత్రత కాపాడాలి