
క్రీడల్లోనూ రాణించాలి
జనగామ రూరల్: విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం సోషల్ వాయిస్ ఫౌండేషన్ అధ్వర్యంలో పట్టణంలోని స్థానిక మినీ స్టేడియంలో ఫౌండేషన్ అధ్యక్షుడు మంగళంపల్లి రాజు అధ్యక్షతన మార్షల్ ఆర్ట్స్ పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిస అయితే వారి భవిష్యత్తు పాడవడమే కాకుండా కుటుంబం కూడా రోడ్డున పడుతుందని హెచ్చరించారు. విద్యార్థులు, యువత జాగ్రత్తగా ఉండాలని, క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. 150 మంది క్రీడాకారులు కరాటే, కుంగ్ ఫూ, బాక్సింగ్, తైక్వాండో పోటీల్లో పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యులు అభిగౌడ్, డైరెక్టర్ సముద్రాల దేవిప్రసాద్, మాస్టర్లు సారయ్య, విక్రమ్, సంతోష్, అబ్బాస్, వినోద్ సభ్యులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి