
సీసీఐ కొనుగోళ్లలో అక్రమాలు అరికట్టాలి
జనగామ రూరల్: జిల్లా పరిధిలోని రైతుల పత్తి పంటను మాత్రమే కొనుగోలు చేయాలని, సీసీఐ, కాటన్ మిల్లుల కొనుగోలు కేంద్రాల్లో అవినీతి, అక్రమాలు అరికట్టాలని తెలంగాణ రైతు సంఘం పట్టణ కార్యదర్శి మంగ బీరయ్య కోరారు. బుధవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఏఓ శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా బీరయ్య మాట్లాడుతూ..జిల్లాలో మొత్తం 16 పత్తి కాటన్ మిల్లులు ఉన్నాయని రెతులు తమ పత్తి విక్రయించడానికి సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో డాటా ఎంట్రీ ఆపరేటర్లను కలెక్టర్ ఆధ్వర్యంలో నియమించాలని, సాఫ్ట్‌వేర్ కాంట్రాక్టులు పారదర్శకంగా ఉండాలన్నారు. మిల్లర్లు రైతుల నుంచి 2శాతం కమీషన్ వసూలు చేస్తే వెంటనే మిల్లుల లైసెన్స్ రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తాండ్ర ఆనందం, కరే బీరయ్య పాల్గొన్నారు.