
హైవేల నిర్మాణ పనులు వేగవంతం కావాలి
జనగామ రూరల్: జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను జాప్యం లేకుండా సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్‌న్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తి కావాలని సీఎం స్పష్టం చేశారు. కోర్టు కేసులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి పంపాలన్నారు. రహదారి నిర్మాణ పనుల్లో జాప్యం జరుగకుండా భూసేకరణలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదన్నారు. వీసీలో ఆర్డీవో గోపిరామ్, ఆర్‌అండ్‌బీ ఈఈ స్వరూపారాణి, మైనింగ్ అధికారి విజయ్ కుమార్, ఎఫ్‌ఆర్‌వో కొండల్‌రెడ్డి, జాతీయ రహదారుల అధికారులు పాల్గొన్నారు.
భూసేకరణ ప్రక్రియలో జాప్యం చేయొద్దు
వీసీలో కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం