
క్రీడలతో నాయకత్వ లక్షణాలు
● ఏసీపీ భీమ్‌శర్మ
స్టేషన్‌ఘన్‌పూర్: క్రీడల ద్వారా విద్యార్థుల్లో దేహదారుఢ్యం, మానసికోల్లాసంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ఏసీపీ భీమ్‌శర్మ అన్నారు. ఈనెల 24న మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ షూటింగ్‌బాల్ పోటీలకు ఎంపికై న జనగామ జిల్లా జూనియర్ బాలబాలికల జట్లకు చెందిన 24 మంది విద్యార్థులకు సోమవారం క్రీడాదుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏసీపీ ముఖ్య అతిథిగా హాజరై క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో షూటింగ్‌బాల్ అసోసియేషన్ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నెపు కుమార్, ఉపాధ్యక్షులు పీడీలు దేవ్‌సింగ్, యాదగిరి, సాంబన్న, పీఈటీలు మహాలక్ష్మీ, రాజు, సుధాకర్, అజయ్, సాంబరాజు, నరేశ్, మధుసూదన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.