
కళాసంపదను ముందుతరాలకు అందించాలి
నర్మెట: కళాసంపదను ముందుతరాలకు అందించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, మాజీ గవర్నర్ దత్తాత్రేయ అన్నారు. జనగామ జిల్లా నర్మెట మండలం అమ్మాపురానికి చెందిన ప్రఖాత్య కొయ్యబొమ్మల కళాకారుడు కీ.శే.మోతే జగన్నాథం అమూల్యమైన కళను గుర్తిస్తూ బిట్స్ పిలానీ (హైదరాబాద్) వారు జగన్నాథం సతీమణి మోతె ఉప్పలమ్మ, కుమారుడు కనకయ్య, నర్సయ్య, శ్రీనివాస్, బృందం సభ్యులు కొండయ్య, వీరయ్య, ఐలయ్య, యాదగిరి, మీనయ్య, శంకర్, రవి బృందాన్ని ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఎంపవరింగ్ లైవ్లీహుడ్స్, హానరింగ్ ఎక్సలెన్స్ నిర్వహించిన ఆశా గీతాంజలి 2025 కార్యక్రమంలో అమ్మఒడి నా తెలంగాణా రాయపూడి నాగేంద్ర రచించిన పుస్తకావిష్కరణలో బృదం బొమ్మలాటలను ప్రదర్శించి పలువురి మెప్పుపొందారు. కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, సింగరేణి కాలరీస్ సీఎండీ బలరాం, బిట్స్ పిలానీ డైరెక్టర్ ప్రొఫెసర్ ముఖర్జీ, డీన్ ప్రొ. యోగీశ్వరిని, ప్రొ. ఎం. పాండురంగారావు, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు పేరాల శేఖర్‌రావు, ప్రజాప్రతినిధులు పైడి రాకేశ్‌రెడ్డి, కోవ లక్ష్మి, పల్వాయి హరీశ్ బాబు, ఆదివాసీ కళాకారులు, సామాజికవేత్తలు పాల్గొన్నారు.
గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
కొయ్యబొమ్మల కళాకారులకు
సన్మానం