
వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
లింగాలఘణపురం:స్వస్థ్‌నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని గ్రామీణ మహిళలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ మ ల్లికార్జున్‌రావు కోరారు. శనివా రం మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో జరుగుతున్న కార్యక్రమాన్ని పరి శీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 రోజుల పాటు వచ్చే అక్టోబర్ 1వ తేదీ వరకు జరిగే ఈ ప్రోగ్రాంలో పీహెచ్‌సీకి ఆయా విభాగాల ప్రత్యేక వైద్యులు వచ్చి సేవలు అందిస్తారన్నారు. ఆస్పత్రి సిబ్బంది కూడా గ్రామీణ మహిళలకు సేవలు అందేవిధంగా చూడాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, గైనకాలజిస్టు డాక్టర్ శ్రీదేవి గర్భిణులకు, సీ్త్రలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి స్వర్ణలత, వైద్య సిబ్బంది ఉన్నారు.