
రైల్వేస్టేషన్‌లో స్వచ్ఛతా హీ సేవా
జనగామ రూరల్: సికింద్రాబాద్ భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ డీఓసీ ఆదేశాల మేరకు జనగామ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ‘స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం’ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ మాస్టర్ మల్లికార్జున్ మాట్లాడుతూ..దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛ భారత్ ఽనిర్వహిస్తుందని అందులో భాగంగా ప్రత్యేక కార్యక్రమం, వాక్‌థాన్ నిర్వహించగా, ‘శ్రమదానంలో ఒక రోజు, ఒక గంట, అందరం కలసి..’అనే కార్యక్రమంలో రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రజలలో పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో ప్రశాంత్, ఏలియా, జోగు భాస్కర్, నక్క తిరుపతి, హాఫిజ్, క్లర్క్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.