లింగగూడెంతో గత పదేళ్లుకు పైగా ంఆవోఏగా కొనసాగుతున్నాను. ని భర్త గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీలో తిరిగారనే సాకుతో ఉద్యోగానికి రాజీనామా చేయాలని కోరుతున్నారు. స్థానిక నేతలు నేరుగానే బెదిరింపులకు దిగుతున్నారు. రాజకీయాలతో ముడిపెట్టి వేధింపులు, ఇబ్బందులకు గురిచేయడం ఎంత వరకు సమంజసం.
మల్లెల్లి ద్వారకా, లింగగూడెం, చింతలపూడి మండలం
ఉంగుటూరు మండలం బొమ్మిడిలో 2009 నుంచి పనిచేస్తున్నారు. ఇటీవల ఎన్నికల అనంతరం గ్రామానికి చెందిన టీడీపీ నేత మానాలని వేధింపులకు దిగారు. దీంతో వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశాను. బంధువులు సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో బతికి బయటపడ్డా. కుటుంబ సభ్యులకు మాత్రం రూ.1.80 లక్షల ఖర్చు మిగిల్చింది.
వంపుగడప శారద, బొమ్మిడి, ఉంగుటూరు మండలం
విధుల్లోంచి తొలగించిన వీవోఏలను తక్షణం విధుల్లోకి తిరిగి తీసుకోవాలి. వారికి గత ఐదు నెలలుగా బకాయి పడ్డ వేతనాలు విడుదల చేయాలి. ఎక్కడైనా ఎవరైనా తప్పు చేస్తే వారిపై శాఖపరమైన విచారణ చేపట్టి అవసరమైన చర్యలు తీసుకోవాలే తప్ప ఈ విధంగా చేయడం తగదు.రాజకీయ వేధింపులు, కక్ష సాధింపు ధోరణులు అమానవీయం. ఆర్.లింగరాజు,
జిల్లా అధ్యక్షుడు, సీఐటీయూ, ఏలూరు
వీవోఏలకు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నేరుగా వార్నింగ్‌లు ఇస్తున్నారు. మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆందోళనలు, నిరసనలు చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. చింతలపూడి మండలంలో ఒక టీడీపీ నాయకుడు ఏకంగా ఎవరూ రోడ్డెక్కడానికి వీల్లేదని అతిక్రమిస్తే ఆ రోజు నుంచి విధుల్లోకి రావాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
ఎస్‌కె.సుభాషిణి, వీవోఏల సంఘం
జిల్లా కార్యదర్శి, ఏలూరు
రాజకీయాలతో ముడిపెట్టి వేధింపులు
రాజకీయాలతో ముడిపెట్టి వేధింపులు
రాజకీయాలతో ముడిపెట్టి వేధింపులు