చిరుద్యోగులపై పచ్చ ప్రతాపం | - | Sakshi
Sakshi News home page

చిరుద్యోగులపై పచ్చ ప్రతాపం

Oct 6 2025 2:40 AM | Updated on Oct 6 2025 2:40 AM

చిరుద

చిరుద్యోగులపై పచ్చ ప్రతాపం

ఏలూరు (టూటౌన్‌): ప్రభుత్వం ఇచ్చే నామమాత్రపు గౌరవ వేతనం రూ.8 వేలతో కాలం వెళ్లదీస్తున్న వీవోఏలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారి జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. తెలుగు తమ్ముళ్ల వేధింపులు, బెదిరింపులు ఎక్కువయ్యాయి. మీరు ఉద్యోగాల్లోంచి తప్పుకుంటే మా మనుషులను పెట్టుకుంటామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి ధర్నాలు, నిరసనలకు దిగితే ఊరుకునేది లేదని.. మొత్తం అందరినీ విధుల్లోంచి తొలగిస్తామంటూ బెదిరిస్తున్నారు.

ఏలూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 39,539 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. వీటి పరిధిలో 3,89,801 మంది సభ్యులు ఉన్నారు. గ్రామ సమాఖ్యలు 1300 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో 1300 మంది వీవోఏలు పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలల వ్యవధిలోనే 150 మందిని ఎలాంటి కారణాలు లేకుండా తొలగించారు. స్థానిక తెలుగు తమ్ముళ్లు చెప్పినట్లు వింటేనే విధుల్లో ఉండండి లేకుండా రాజీనామాలు చేసి వెళ్ళిపోండి అని బెదిరిస్తున్నారు.

లింగపాలెం మండల పరిధిలో 11 మందిని తెలుగు తమ్ముళ్ళు విధుల్లోంచి తొలగించేలా చేసారు. వీరిలో ఏడుగురు ఎస్సీలు ఉండటం గమనార్హం. వీరంతా కలిసి కోర్టుకు వెళ్ళారు. కోర్టు సైతం వారిని విధుల్లో కొనసాగించాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. వీరు ఇంతకు ముందు పనిచేసే చోట కొత్తవారిని నియమించేసారు. దీంతో 11 మంది కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతూ డీఆర్‌డీఏ అధికారులు, స్పందనలో కలెక్టర్‌కు తమ గోడు మొరపెట్టుకున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు ఇబ్బంది ఏమి ఉంది వెళ్లి మీ విధులు మీరు చేసుకోండి అని చెప్పి పంపించేస్తున్నారు. తీరా అక్కడకు వెళ్ళాక ఆ మండల ఏపీఎం వీరితో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో ఒక్క మాట చెప్పి మిమ్మళ్లను విధుల్లోకి తీసుకుంటామంటూ చెప్పడంతో బాధితులు ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.

అందని వేతనాలు

జిల్లా వ్యాప్తంగా వీవోఏలకు నెల నెలా వేతనాలు విడుదల చేయడం లేదు. అసలే ఇచ్చేది నామమాత్రపు వేతనం. అదీ నెల నెలా ఇవ్వకపోవడం పట్ల వీవోఏలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గట్టిగా అడిగితే స్థానిక ప్రజాప్రతినిధులు ఇష్టముంటే చేయండి లేకుంటే తప్పుకోండి అంటూ సమాధానం ఇస్తుండటంతో వీవోఏలు మౌనంగానే వేతనాలు రాకపోయినా తమ పని తాము చేసుకుని వెళుతున్నారు.

వీఓఏల ప్రధాన డిమాండ్లు

బకాయి వేతనాలు చెల్లించాలి.

ఆన్‌లైన్‌ పని భారం తగ్గించాలి.

5జీ మొబైల్స్‌ అందించాలి.

కాలపరిమితి సర్క్యులర్‌ రద్దు చేయాలి.

వేతనాలు పెంచాలి.

హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలి.

రూ.10 లక్షల గ్రూప్‌ బీమా కల్పించాలి.

అర్హులైన వారికి సీసీలుగా

ప్రమోషన్‌లు కల్పించాలి.

జిల్లాలోని వీవోఏలపై కూటమి నాయకుల వేధింపులు

వేధింపులు తట్టుకోలేక రాజీనామాలు

తెలుగు తమ్ముళ్లకు వత్తాసు పలుకుతున్న డీఆర్‌డీఏ ఏపీఎంలు, సీసీలు

చిరుద్యోగులపై పచ్చ ప్రతాపం 1
1/1

చిరుద్యోగులపై పచ్చ ప్రతాపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement